తెలంగాణ పూల సంబురం బతుకమ్మ పండుగను ఉద్యమరూపంగా మార్చిన ఘనత సోదరి కవితేనని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు నేడు బతుకమ్మను సగర్వంగా జరుపుకుంటున్నారంటే దాని వెనక కవిత సారథ్యంలోని జాగృతి సంస్థ ఆనాడు చేసిన పోరాటం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతేనని కేటీఆర్ కొనియాడారు.
అప్పటి సమైక్య పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను ఆడకుండా అడ్డుకుని తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు జాగృతి సంస్థ హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై సంబురంగా నిర్వహించిందని గుర్తు చేశారు. తన సోదరి కవితతోపాటు దశాబ్దకాలంగా జాగృతి సభ్యులు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Comments
Post a Comment