Skip to main content

Posts

2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు

  మహాత్మాగాంధీకి చెందిన కళ్లజోడు ఇంగ్లండ్లో జరిగిన వేలంలో భారీ ధర పలికింది. ఇంగ్లండ్ కు చెందిన ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలం నిర్వహించగా. అందులో ఇది 2.6లక్షల యూరోలు(రూ.2.5కోట్లు పలికింది. వేలంలో కనీసం 15వేల యూరోలు(రూ 5లక్షలు)పలుకుతుందని నిర్వాహకులు భావించగా. అనూహ్యంగా అది భారీ ధర పలికింది. గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు 2 HOURS AGO

పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్రం తీపికబురు–

  అంతర్రాష్ట్ర రవాణా విషయంలో ఎలాంటి కండిషన్లు పెట్టొద్దని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశించారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టం చేశారు. ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం చేశారు. అన్ లాక్ 3లో భాగంగా కేంద్ర హోంశాఖ జూలై 27న రాష్ట్రాలకు పలు నిబంధనలను సూచించింది. అందులోని పేరా 5లో అంతర్రాష్ట్ర రవాణా మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రజలుకానీ, వాహనాలు కానీ వెళ్తే వారికి లేదా వాటికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ప్రత్యేక పర్మిషన్లు, అనుమతులు, ఈ-పాస్‌లు కూడా అవసరం లేదు. పొరుగుదేశాల నుంచి వచ్చే వాహనాల విషయంలో కూడా ఎలాంటి కొ...

Best Laptop Deals: స్టార్టింగ్ ధర కేవలం రూ.15,990 మాత్రమే

Best Laptop Deals ద్వారా ఈరోజు Amazon మరియు Flipkart నుండి తక్కువ ధరకు అమ్ముడవుతున్నల్యాప్ టాప్స్ డీల్స్ అందుకోండి. కేవలం 20,000 రూపాయల కంటే తక్కువ ధరకే ఒక ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్స్ ని ఎంచుకోవచ్చు. కేవలం రూ.15,990 నుండి మొదలుకొని రూ. 20,999 ధరలో వున్న బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మరియు అఫర్స్ Best Laptop Deals ద్వారా ఈరోజు Amazon మరియు Flipkart నుండి తక్కువ ధరకు అమ్ముడవుతున్నల్యాప్ టాప్స్ డీల్స్ అందుకోండి. కేవలం 20,000 రూపాయల కంటే తక్కువ ధరకే ఒక ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్స్ ని ఎంచుకోవచ్చు. ఈ అఫర్ ఎక్కువ డిస్కౌంట్ తో రాకపోయినా కూడా ఈ ల్యాప్ టాప్స్ మాత్రం చాలా తక్కువ ధరకే అమ్మడు అవుతున్నాయి. వీటిలో, కేవలం రూ.15,990 నుండి మొదలుకొని రూ. 20,999 ధరలో వున్న బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మరియు అఫర్స్ ని ఇక్కడ మీకోసం అందిస్తున్నాను.                   1. Avita Magus MRP : Rs. 19,990 అఫర్ ధర : Rs.17,990 ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ Ce...

సంప్రదాయ దుస్తుల్లో మెగాస్టార్‌, బన్నీ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్

  వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్‌ ఇంట్లో గణనాథుడికి పూజలు చేశారు. ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి చిరంజీవి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.                          హ్యాపీ గణేశ్ చతుర్థి.. హ్యాపీ బర్త్ డే డ్యాడ్' అంటూ రామ్ చరణ్ కూడా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో మెగా కుటుంబం సంప్రదాయ దుస్తుల్లో కనపడుతోంది. ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబమంతా వేడుకలు చేసుకుంటోంది. మరోవైపు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఇంట్లో పూజల్లో పాల్గొని సంప్రదాయ దుస్తులు ధరించి భార్యాపిల్లలతో ఫొటోలు దిగాడు.        

నాగార్జున్ సాగర్ 18 గేట్లు ఓపెన్

నాగార్జు సాగర్ కు శ్రీ శైలంనుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు18 గేట్లను ఎత్తారు. 27 రోజులుగా శ్రీశైలం నుంచి నిలకడగా ఇన్ఫ్లో వస్తుండడంతో నాగార్జున సాగర్లో నీటిమట్టం 578 అడుగులకు చేరుకుంది.శుక్రవారం ఉదయం మొదట నాలుగుగేట్లు ఎత్తారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 4లక్షల క్యూసెక్కులకు పెరగడంతో18 గేట్లను ఎత్తి 1,38,240 క్యూసెక్కులు,ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా మరో 24,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్లో నీటిసామర్థ్యం 312టీఎంసీలకుగాను 300టీఎంసీలకు చేరుకుంది.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?

  ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్న ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలన్న ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఖైరతాబాద్ వినాయకుడి సొంతమని అన్నారు. కరోనాను పారద్రోలడానికి, ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, వ్యాక్సిన్ తొందరగా రావాలి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, కరోనా వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా హెచ్చరించారని అన్నారు. డిసెంబర్ వరకు మహమ్మారి కనుమరుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

చైనాకు భారత్ షాక్

  సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకి కేంద్ర ప్రభుత్వం మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే.. చైనాకి సంబంధించిన పలు యాప్ లను భారత్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో షాకిచ్చింది. వందే భారత్ రైళ్ల టెండర్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని నెలల క్రితం వందే భారత్ మిషన్ లో భాగంగా 44 సెమీ హైస్పీడ్ రైళ్ల తయారీకి భారత రైల్వే శాఖ టెండర్లకు ఆహ్వానించింది. కాగా.. దానిని చైనా కి చెందిన సంస్థ దక్కించుకుంది. కాగా.. తాజాగా ఆ టెండర్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వారం రోజుల్లో కొత్తగా టెండర్లకు బిడ్‌ను ఆహ్వానించునున్నట్టు ప్రకటించింది. #china

పాలవ్యాపారంలోకి మంత్రి హరీశ్‌రావు కుటుంబం.. ‘మిల్చి మిల్క్’ పేరుతో నయా బ్రాండ్ ఆవిష్కరణ

  తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కుటుంబం పాలవ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘మిల్చి మిల్క్’ పేరుతో హరీశ్‌రావు భార్య శ్రీనిత శుక్రవారం పాల ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనిత మాట్లాడుతూ.. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని శ్రీనిత పేర్కొన్నారు.

కరోనాను తగ్గిస్తున్న ఆయింట్‌మెంట్‌? యూఎస్‌ఎఫ్‌డీ ఆమోదం లభించిందన్న అమెరికన్‌ కంపెనీ

  ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా పొట్టనబెట్టుకున్న కరోనా సహా అనేక వైరస్‌లను సంహరించే తమ ఆయింట్‌మెంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తెలిపింది. దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యుడు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరం లేదని పేర్కొంది. సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చని వెల్లడించింది. ఆ ఆయింట్‌మెంట్‌ పేరు ఏపీటీ టీ3ఎక్స్‌ కావడం గమనార్హం. ‘టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసింది’ అని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్‌ తెలిపారు. ‘ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోపగడుతుంది. ఇదో గొప్ప ఆవిష్కరణ. ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది’ అని ఆయన తెలిపారు. ‘టీ3ఎక్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఉంది. మందుల చిట్టీ లేకుండానే కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ...

సోనూసూద్ కు ఒక్క రోజే.. 31 వేల మెసేజ్లు

  సాయమంటే నేనున్నా అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్. ఎవరికి ఏ ఆపద వచ్చినా తీరుస్తున్నాడు దీంతో మమ్మల్ని ఆదుకోవాలంటూ అతడికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కలిపి 31,690 మెసేజ్లు వచ్చాయని సోనూ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. అందరిని చేరుకోవడం అసాధ్యమైనా, తన వంతు ప్రయత్నం చేస్తానని, సాయం పొందలేనివాళ్లు క్షమించాలని పేర్కొన్నాడు  #sonusood

మోపిదేవి కారు కి రోడ్డు ప్రమాదం

  విశాఖపట్నం జిల్లా  కసిం కోట మండలం తాళ్ల పాలెం వద్ద ఎంపీ మోడిదేవి కి తప్పిన ప్రమాదం మోపిదేవి కుటుంబ సభ్యులు సురక్షితం, మోపిదేవి కుటుంబానికి సహాయపడ్డ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులు అదే మార్గంలో వెళుతున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి కాన్వాయ్

శ్రీశైలం ఘటనలోతొమ్మిది మంది మృతి*

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఏఈ మోహన్‌కుమార్‌, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్‌గా గుర్తించారు. సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్‌, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.

రోహిత్ శర్మకు ఖేల్ రత్న

  క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు భారత క్రీడాకారులు ఖేల్ రత్నకు ఎంపికయ్యారు రోహిత్ శర్మ'(క్రికెట్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్) మణికబాత్రా(టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫొగట్(రెజ్లింగ్), రాణి ('హాకీ) ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు

కేంద్రం గుడ్ న్యూస్.. వారికి నిరుద్యోగ భృతిగా 50 శాతం శాలరీ..

  కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు నిరుద్యోగ భృతిగా 50 శాతం శాలరీని మూడు నెలల పాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో సభ్యులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారికి ఈ నిరుద్యోగ భృతిని చెల్లించనున్నారు. అయితే ఈ పధకాన్ని 2021, జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. ఈ ఏడాది చివరన దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ”ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ స్కీంని పొడిగించడంతో పాటు.. నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు”. దీనితో 30 లక్షల నుంచి 35 లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలంలో నిరుద్యోగులను ఆదుకోవాలని చాలా సెక్టార్ల నుంచి డిమాండ్లు రావడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది.

ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండవు.. బయటపడతాం: వీడియో విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి

వీడియో చూడండి:  https://youtu.be/gJbsi9f6GZk సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారికి సాయం చేసేందుకు  క‌రోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. సినీ ప్ర‌ముఖుల నుంచి విరాళాలు సేకరించి కార్మికులకు సాయం చేస్తున్నారు. మరోసారి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చిరు చెబుతూ... ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండబోవని అన్నారు. త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు పదివేల మంది సినీ కార్మికులకు  తాము సరుకులు అందిస్తున్నామన్నారు.   'కరోనా మనకేం రాదులే.. మనకేం కాదులే' అన్న నిర్లక్ష్య ధోరణి ఎవ్వరికీ వద్దని ఆయన చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గణనాథుడు గట్టెక్కించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ వినాయక చవి...

ఎస్పీ బాలుకు మాళవిక వల్లే కరోనా సోకిందంటూ ప్రచారం... పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని

ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. అయితే ఆయనకు కరోనా సోకడానికి తానే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రముఖ గాయని మాళవిక వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు గారికి కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.  

శ్రీశైలం ఎడమ పాతాళగంగ వద్ద భారీ అగ్నిప్రమాదం... పలువురు గల్లంతు!

  తెలంగాణ పరిధిలోని టీఎస్ జెన్ కో అధీనంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు పాతాళగంగ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరుగగా, పది మంది వరకూ గల్లంతయ్యారు. విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో 17 మంది వరకూ లోపల ఉన్నారని తెలుస్తోంది. ప్యానల్ సర్క్యూట్ లో తొలుత మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం తరువాత 8 మంది బయటకు పరుగులు తీయగా, డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్, ఉద్యోగులు మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, రాంబాబు, కిరణ్ ల కోసం గాలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకుని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.  

పోలవరం సకాలంలో పూర్తయివుంటే ఇంతటి వరద పరిస్థితులు ఉండేవి కావు: పవన్ కల్యాణ్

  గోదావరి వరదల నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై పరిశీలనకు వెళ్లిన జనసేన బృందాలు చెబుతున్న వివరాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు కూడా లేవని, పసిపిల్లలకు పాలు కూడా అందడంలేదని వెల్లడించారు. వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని, పసిబిడ్డలకు పాల కోసం అడిగితే పాలు అత్యవసర వస్తువుల జాబితాలో లేవన్న నిర్లక్ష్యపూరితమైన సమాధానం అధికారుల నుంచి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పాలను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి పసిబిడ్డల ఆకలి తీర్చాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని స్పష్టం చేశారు. వరదల కారణంగా 10 వేల ఎకరాల్లో వరి పంట, 14 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ...

డియర్‌ సూపర్‌మ్యాన్ సోను సూద్‌.. నాకు హెల్ప్‌ చేయి!: సినీనటుడు బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్

 కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీనటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ ఆయనకు ప్రతిరోజు  వేలాది మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. వీలైనంత మేరకు సోను సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయనను చాలామంది సూపర్‌మ్యాన్‌తో పోల్చుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా, సినీనటుడు బ్రహ్మాజీ సోను సూద్‌కు ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'డియర్ సూపర్‌మ్యాన్‌ సోను భాయి.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. మానసికంగా లాక్‌డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో ఇరుక్కుపోయాను.. నన్ను ఈ ప్రాంతానికి తీసుకెళ్లు..' అంటూ ఆయన క్రొయేషియాలోని ఓ బీచ్‌ ఫొటోను పోస్ట్ చేశాడు. ఎంతో విలాసవంతంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లాలని ఉందంటూ ఆయన సరదాగా చెప్పాడు. ఆయన చేసిన పోస్ట్ పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనపై ఓ నెటిజన్ వేసిన సెటైర్‌కు సంబంధించిన వీడియోను కూడా బ్రహ్మాజీ పోస్ట్ చేయడం గమనార్హం.

హైద్రాబాద్ లో పాలను అపరిశుభ్రం చేస్తున్న డైరీ ఫామ్ యజమాని అరెస్ట్