Skip to main content

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?

 


ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్న ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలన్న ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఖైరతాబాద్ వినాయకుడి సొంతమని అన్నారు. కరోనాను పారద్రోలడానికి, ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, వ్యాక్సిన్ తొందరగా రావాలి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, కరోనా వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా హెచ్చరించారని అన్నారు. డిసెంబర్ వరకు మహమ్మారి కనుమరుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Comments