వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో గణనాథుడికి పూజలు చేశారు.
ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి చిరంజీవి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన
ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
హ్యాపీ గణేశ్ చతుర్థి.. హ్యాపీ బర్త్ డే డ్యాడ్' అంటూ రామ్ చరణ్ కూడా ఓ
ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో మెగా కుటుంబం సంప్రదాయ దుస్తుల్లో
కనపడుతోంది. ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబమంతా
వేడుకలు చేసుకుంటోంది.
మరోవైపు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఇంట్లో పూజల్లో పాల్గొని
సంప్రదాయ దుస్తులు ధరించి భార్యాపిల్లలతో ఫొటోలు దిగాడు.
Comments
Post a Comment