Skip to main content

డియర్‌ సూపర్‌మ్యాన్ సోను సూద్‌.. నాకు హెల్ప్‌ చేయి!: సినీనటుడు బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్



 కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీనటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ ఆయనకు ప్రతిరోజు  వేలాది మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. వీలైనంత మేరకు సోను సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయనను చాలామంది సూపర్‌మ్యాన్‌తో పోల్చుతున్నారు. 


ఈ క్రమంలో తాజాగా, సినీనటుడు బ్రహ్మాజీ సోను సూద్‌కు ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'డియర్ సూపర్‌మ్యాన్‌ సోను భాయి.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. మానసికంగా లాక్‌డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో ఇరుక్కుపోయాను.. నన్ను ఈ ప్రాంతానికి తీసుకెళ్లు..' అంటూ ఆయన క్రొయేషియాలోని ఓ బీచ్‌ ఫొటోను పోస్ట్ చేశాడు.

ఎంతో విలాసవంతంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లాలని ఉందంటూ ఆయన సరదాగా చెప్పాడు. ఆయన చేసిన పోస్ట్ పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనపై ఓ నెటిజన్ వేసిన సెటైర్‌కు సంబంధించిన వీడియోను కూడా బ్రహ్మాజీ పోస్ట్ చేయడం గమనార్హం.

Comments