ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో
పోరాడుతున్నారు. అయితే ఆయనకు కరోనా సోకడానికి తానే కారణం అంటూ సోషల్
మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రముఖ గాయని మాళవిక వాపోయారు. దీనిపై ఆమె
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న
వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు గారికి కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.

Comments
Post a Comment