డోర్ డెలివరీ ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్ సంస్థ ఈ దిశగా తొలి అడుగులు వేసింది. వినూత్న ఆవిష్కరణలకు పేరుగాంచిన గూగుల్ కంపెనీ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి మనుషులకు బదులుగా డ్రోన్ లను ఉపయోగించడంలో విజయవంతమైంది. ఈ సౌకర్యాన్ని అమెరికాలో అప్పుడే ప్రారంభించింది కూడా.
ఇక దేశంలో ఈ తరహా సర్వీస్ ను అందించడానికి గూగుల్ సంస్థ అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది. సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ యూనిట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు ‘వింగ్’ అని పేరు పెట్టి అక్కడి ఫెడ్ ఎక్స్ ఎక్స్ ప్రెస్, వాల్ గ్రీన్స్ కంపెనీల వస్తువులను డ్రోన్ల ద్వారా వినియోగదారులకు డెలివరీ చేస్తోంది.
సాధారణంగా మనుషులను డెలీవరీకి వినియోగిస్తే ట్రాఫిక్ చిక్కులతో సమయం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. డ్రోన్ డెలివరీ ఇలాంటి అవరోధాలు అధిగమించి వస్తులను అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తుంది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో డ్రోన్ ప్రయాణిస్తుంది. విమానాల్లో ఉపయోగించే సాఫ్ట్ వేర్, సెన్సార్లను డ్రోన్లలో అమర్చడంతో వీటి ప్రయాణం సాఫీగా సాగుతుంది. మనదేశంలో కూడా ఈ డ్రోన్ డెలివరీ వ్యవస్థ త్వరలో రానుందని సమాచారం.
Comments
Post a Comment