Skip to main content

అలా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు: ధర్మాన ప్రసాదరావు

 

 ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా, ఆయన తాబేదారులు, కొంతమంది సహచరులు కలసి, ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవిధంగా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదని భావిస్తున్నట్టు చెప్పారు.

గడచిన ఐదేళ్లలో బాబు పాలన చూశామని, అనేక చట్టాలను మోసగించి, కోర్టులకు దొరకకుండా, ఎత్తుగడలతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తాబేదారులకు, అనుకూలమైన సంస్థలకు చంద్రబాబు దోచిపెట్టిన విషయం బహిరంగ రహస్యం అన్నారు. ఆనాడు తనకు అనుకూలంగా ఉన్న అనేక పత్రికలను అడ్డంపెట్టుకుని అనేక మంది జీవితాలతో ఆడుకున్నారని, రాజకీయంగా పతనం చేయాలని, రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందని, ఈ రాష్ట్రంలో గూండాయిజం సాగుతోందని, బీహార్ లా అయిపోయిందని మాట్లాడుతున్న చంద్రబాబు, నాడు తన పాలన ఎలా సాగిందో ఆయన చూసుకున్నారా? టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంత అప్రతిష్టపాలైందో, ఎంత ధనం దోపిడీ అయిపోయిందో, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారో అంటూ ఆరోపణలు గుప్పించారు.   

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...