Skip to main content

రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు: కన్నా






ఏపీలో విపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. టీడీపీని వెనక్కినెట్టి తాను బలోపేతం కావాలన్నది బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది. ఆ దిశగానే పావులు కదుపుతోన్న కాషాయదళం టీడీపీపై మాటల యుద్ధంలో మరింత పదును పెంచింది. రాజకీయ విలువలు లేని టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అ

మిత్ షా టీడీపీకి శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారని తెలిపారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.   

Comments