Skip to main content

అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు!

సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల కోసం రూ.264 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పది వేల రూపాయల లోపు డిపాజిట్ దారులక తొలుత చెల్లింపులు చేయనున్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు వైసీపీ నేతలు తమ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులో ర్యాలీలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు విడదల రజిని, షేక్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవీ, వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.   

Comments