Skip to main content

బోటు వెలికితీత మళ్లీ విఫలం




తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన ‘రాయల్‌ వశిష్ట’ బోటును వెలికితీసేందుకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బోటు ఎక్కడ ఉందన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించిన ఆ బృందం ఈ రోజు దాన్ని వెలికితీసే పనుల్లో మరోసారి విఫలమైంది. యాంకర్‌కు చిక్కిన బోటు దాన్ని పైకి లేపే క్రమంలో పట్టు కోల్పోయింది.

మరోవైపు, బోటులోనే మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్న ఈతగాళ్లు ఈ కారణంగా ఈదుతూ బోటు దగ్గరికి వెళ్లేందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో విశాఖపట్నం నుంచి కొందరు గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. ఈ పని మీదే ధర్మాడి సత్యం విశాఖకు వెళ్లారు.    

Comments