పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్ష విధానంలో కూడ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా వందమార్కుల పరీక్ష పేపరులో ఉండాల్సి బిట్ క్వశ్చన్ పేపరును ప్రత్యేకంగా ఇవ్వకుండా, జవాబు పత్రంతో పాటే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పరీక్ష సమయాన్ని కూడ మరో 15 నిమిషాలు పొడగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విధానాలు రానున్న విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నట్టు మంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవతరగతి పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. మాధ్యమిక విద్యావిధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించిన అనంతరం పలు నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇందులో భాగంగానే పదవ తరగతి పరీక్షలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల్లో కార్పోరేట్ పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే అభిప్రాయంతోనే వాటిని రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
Comments
Post a Comment