Skip to main content

రానున్న 72 గంటలు వర్షాలే వర్షాలు..

రానున్న మూడు రోజులు వరుసగా వర్షాలు దంచికొడుతాయని వాతవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో గురువారంతో మొదలై ఆదివారం వరకు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) స్పష్టంచేసింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. 27వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 28వ తేదీ ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే చాన్సు ఉందని చెప్పింది. ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో 48 గంటల తరువాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. మరో వైపు హికా తుఫాన్ ప్రభావం కారణంగా ఎగువన కురిసే భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయని.. జీవనధులకు భారీగా వరద ముప్పు పొంచి ఉందని తెలిపాయి.
రానున్న 72 గంటలు వర్షాలే వర్షాలు..

Comments