Skip to main content

విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు

Image result for VIJAYASAI REDDYటెండరింగ్‌ ప్రకియ వల్ల చంద్రబాబు నాయుడు అవినీతి సాక్ష్యాధారలతో సహా బయటపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.‘రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా.. బాబు. టెండర్లలో పాల్గొనవద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట.


మరి ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరంలో మూడు పనులకే ఇప్పటి వరకు టెండర్లు పూర్తయ్యాయని.. 50కి పైగా ఇరిగేషన్‌ పనులు టెండర్లకు రానున్నాయని విజయ్‌సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు బానిసలు చూడాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్‌సాయి రెడ్డి స్పష్టం చేశారు.పోలవరంలో మూడు పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు బానిసలు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లు ఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయి.ప్రజా ధనాన్ని ఇంత విచ్చల విడిగా, పబ్లిగ్గా దోచుకోవడం ఎక్కడా కనబడదు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఆరోపించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.