Skip to main content

వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది : మాజీ మంత్రి దేవినేని ఉమా

Image result for DEVINENI UMAపోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడిందని, రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి వైసీపీకి నచ్చిన మెగా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .....ఇంతవరకు ఎవరు ఎంతకు కోడ్ చేసింది.. ఏ విధంగా అనుమతులు ఇచ్చిందీ ప్రభుత్వం చెప్పలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడం.. కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోకుండా రూ.7,980 కోట్లు రైతులకు లేకుండా చేశారని, జగన్ ప్రభుత్వం చేసిన మోసం‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారని దేవినేని ఉమా అన్నారు

Comments