Skip to main content

రివర్స్ టెండరింగ్‌లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావు

Image result for GVL NARASIMHARAOపోలవవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉండదని అన్నారు. మరోవైపు పీపీఏల అనుమతుల్లో అవినీతీ లేదని తాము చెప్పలేదని, వాటిపట్ల సూచనలు మాత్రమే చేస్తున్నామని అన్నారు .పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్న సమయంలో గందరగోళం లేకుండా చూడాలని ఆయన సూచించారు.ఇక ఇటివల కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వంద రోజుల్లో కేంద్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ప్రంశసిస్తున్నాయని ఆయన తెలిపారు.ఇటివల టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీల కేసులు ఏవీ మాఫి కావని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సిద్దాంతాలు నచ్చినవారే బీజేపీలోకి వస్తున్నారని అన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతలు బీజేపీ భావజాలంతోనే పని చేయాలని ఆయన సూచించారు. ఇక వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని చెప్పారు. వైసీపీతో కూడ తమకు రాజకీయ అనుబంధం లేదని చెప్పిన ఆయన తప్పు చేస్తే నిలదీస్తామని అన్నారు.

Comments