Skip to main content

ఆ ఇంట్లో నివసించడం ధర్మం కాదు..ఖాళీ చేయండి: చంద్రబాబుకు అంబటి సూచన

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం రాజధాని అమరావతి ఏర్పడిందని, దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో మీరు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు.

నదీ గర్భంలో ఉన్న ఇంట్లో, అనుమతులు లేని ఇంట్లో ఎలా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు లేదా? అవినీతి నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఇంకా నివసించాలని కోరుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు. అక్రమ నిర్మాణంలో నివసించడం ధర్మం కాదు అని, ఆ ఇంటిని ఖాళీ చేసి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబుకు సూచించారు

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  రేపటి నుండి 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలను బంద్ నిర్వహించడం జరుగుతున్నది.గత 15 సంవత్సరాలుగా అరకొర వేతనాలతో పని చేస్తున్నారు. కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలి మీ-సేవ కేంద్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలి.ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అర్బన్ మీ-సేవ కేంద్రాల భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సచివాలయంలో మీసేవ ఉద్యోగుల్ని విలీనం చేయాలని డిమాండ్.రేపటి నుండి 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు