Skip to main content

Posts

దూసుకొస్తున్న హికా తుపాను... తెలుగు రాష్ట్రాలకు ముప్పు

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు హికా ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 'హికా' తుపాను దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావం పలు రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖాధికారులు తెలిపారు. 85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో... చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల.. చెరువులు తెగి, పంటలు నీట మునిగి, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ పథకానికి మోదీ పేరు పెట్టండి, చంద్రబాబులా మరో స్టిక్కర్ సీఎం కావొద్దు: జగన్ కు కన్నా సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కాకండి అంటూ హితవు పలికారు. మ్యానిఫెస్టోలో రైతులకు రూ.12500 ఇస్తానని జగన్ ప్రకటించారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ రైతులకు అందజేసే రూ.6000 కలిపి వైయస్ఆర్ రైతు భరోసా కింద అందజేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న 6 వేలు కలిపి రైతులకు అందజేస్తున్న తరుణంలో వైయస్ఆర్ రైతు భరోసాకు మీరు స్టికర్ వేయడం తప్పు అని చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.  గతంలో చంద్రబాబు కూడా ఇలానే వ్యహరించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రకటించుకున్నారని ఆరోపించారు. కానీ స్టిక్కర్ మాత్రం చంద్రబాబుది ఉండేదని చెప్పుకొచ్చారు. అలాంటి స్టిక్కర్ వేసి మరో స్టిక్కర్ ముఖ్యమంత్రిలా మారొద్దంటూ జగన్ ను సూచించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ ఆసక్తి: సీఎం జగన్ తో పారిశ్రామిక వేత్తల భేటీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ దేశపు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై రెండురోజులపాటు ఏపీలో పర్యటించేందుకు వచ్చింది ఫ్రెండ్ పారిశ్రామిక వేత్తల బృందం. రెండురోజుల పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తల బృందం ఏపీ సీఎం వైయస్ జగన్ తో భేటీ అయ్యింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై సీఎం జగన్ తోపాటు మంత్రులతో చర్చించారు. పెట్టుబడుల అనుకూలతను పారిశ్రామిక వేత్తల బృందానికి మంత్రులు వివరించారు. డెయిరీ, ఆటోమెుబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్, ఆటోమేషన్, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రులు సూచించారు. అందుకు ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు, లోకేష్ లకు అందుకే భయం, సుజనా మీరు టీడీపీ కాదు బీజేపీ : అంబటి రాంబాబు...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అధికారం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఏవేవో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేస్తుండటంతో చంద్రబాబు, నారా లోకేష్ వెన్నులో వణుకుపుడుతోందని ఆరోపించారు. మద్యాన్ని నియంత్రించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతోందని దాన్ని కూడా రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని విమర్శించారు అంబటి రాంబాబు. బెల్ట్ షాపులు రద్దు చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. బెల్ట్ షాపులను రద్దు చేసిందకు మెచ్చుకోవాల్సిన చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.  చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ గత ఐదేళ్లు సంపాదనే ధ్యేయంగా అవినీతి ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదా చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.  వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తండ్రీ కొడుకులిద్దరూ తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నార...

ఉల్లి ధర ఢమాల్‌..రైతు ఫైర్‌

ధర క్రమేణా పెరుగుతుండడంతో సంతోషంగా ఉన్న ఉల్లి రైతులకు బుధవారం ఒక్కసారిగా షాక్‌ తగిలింది. వ్యాపారులు సిండికేట్‌ అయ్యి ఊహించని విధంగా ధర తగ్గించేయడంతో రైతులు భగ్గుమన్నారు. దేశం మొత్తమ్మీద ఉల్లి ధరలు పెరుగుతుండగా... కర్నూలు మార్కెట్‌లో మాత్రం తగ్గడానికి వ్యాపారులు సిండికేట్‌ కావడమే కారణమంటూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. రైతులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు. కొందరు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడించగా... మరికొందరు మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై పడుకోవడంతో పాటు బైఠాయించడంతో దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.   ఉన్నట్టుండి తగ్గించేశారు!  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం ఉల్లి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.4,500 ధర పలికింది. దీంతో బుధవారం ఈ ఏడాది ఇంతవరకు లేని విధంగా మార్కెట్‌కు ఉల్లి పోటెత్తింది. దాదాపు 50 వేల ప్యాకెట్లు వచ్చింది. వ్యాపారులు ఉదయం 11 గంటలకు వేలం పాట మొదలు పెట్టారు. రూ.500తో ప్రారంభించి.. రూ.1,500తో ముగించారు. దాదాపు 20 లాట్లకు ఈ ప్రకారమే ధర పలికింది. ఒక్కసారిగా ధర ...

న‌మ్మించి మోసం చేసిన జ‌గ‌న్ - ఉద్యోగుల ఆగ్ర‌హం

104 సేవలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయముగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పదే పదే చెప్పినా  గత ప్రభుత్వం మాదిరిగా ప్రైవేటు పరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  104 ప‌టిష్ట‌త కోస‌మంటూ కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే  డా.సుజాత రావ్  కమిటీ ని వేసార‌ని, రిపోర్ట్ లో 108 మరియు104 పధకాలను పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరినా ప్ర‌భుత్వం ప్ర‌యివేటు ప‌రం చేసే దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. త‌మ ఉద్యోగ భ‌ద్ర‌త‌పై ఇటీవ‌ల  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ల‌ను క‌లిస్తే    108 మాదిరిగా మీరూ ప్రైవేటు లోనే ఉంటారని తేల్చిచెప్పారని, దీనిని బ‌ట్టి ప్ర‌భుత్వం త‌మ ఉగ్యోగుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునేలా లేద‌ని చెప్పారు. పి పి పి( పబ్లిక్ ప్రైవేట్ పార్టీసిపేషన్)  విధానాన్ని కొనసాగించేలా వైద్య అధికారులు ఇప్ప‌టికే టెండర్లకు పిలిచార‌ని ఇది నమ్మించి ఓట్లు వేయించుకున్న జగన్ న‌ట్టేట ముంచ‌గ‌మేన‌ని ఆందోళ‌న వ్...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది. 

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!

కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో డీకే శివకుమార అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. దక్షిణాదితో పాటు, గుజరాత్ వరకూ కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ ఉన్న డీకే శివకుమారను అరెస్టు చేసి కాంగ్రెస్ దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని.. కాంగ్రెస్  నేతలు వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కర్ణాటక కాంగ్రెస్ వాళ్లతో పాటు, వక్కలిగ కమ్యూనిటీ కూడా భగ్గుమంది. అయితే ఆయనకు న్యాయస్థానం మాత్రం ఊరటను ఇవ్వలేదు. ఆయనను తీహార్ జైలుకే పరిమితం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీహార్ జైలును సందర్శించారు. అక్కడ ఉన్న తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి  చిదంబరాన్ని ఆమె పరామర్శించారు. విశేషం ఏమిటంటే డీకే శివకుమార కూడా అక్కడే ఉన్నారు. ఆయన అరెస్టు పట్ల ఇప్పటికే సోనియాగాంధీ నిరసన వ్యక్తంచేశారు. అ...

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు. ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమ...

సానుభూతి కోసమే చంద్రబాబు కదలడం లేదు: సుజనా చౌదరి ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఆరాటపడుతున్నారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉండవల్లిలోని ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూల్చివేశారని ప్రచారం జరిగితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎలాంటి గొడవలు, వివాదాలు ఉండవు  కదా అంటూ హితవు పలికారు. ఇకపోతే ఏపీలో కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రచారాన్ని నిలిపివేయడంపై కూడా చంద్రబాబు నాయుడును వదల్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీడియా సంస్థలను రాకుండా అడ్డుకున్నారని అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ చేస్తున్నారంటూ సుజనా చౌదరి స్పష్టం చేశారు. మీడియాను నియంత్రించాలనుకోవడం సరికాదని హితవు పలికారు.

నేనైతే అలాంటి ఇంట్లో ఉండను.. చంద్రబాబు ఖాళీ చేయాలి!: బీజేపీ ఎంపీ సుజనా చౌద

ఉండవల్లి కరకట్టపై ఇంట్లో చంద్రబాబు నివాసం ఉండటంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే, అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే ‘నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను. అప్పుడు వారు (చంద్రబాబు) ఉన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటి?’ అని ప్రశ్నించారు. ఆ ఇంటిని ప్రభుత్వం కనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి గురించి లేదా రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయన్న ఆరోపణలపైనా మాట్లాడటమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాపైనా విమర్శలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దొందూదొందేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

బాబు నివాసం పై హైకోర్టుకు లింగమనేని.. విచారణ వాయిదా

చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేస్తామని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై తాజాగా వ్యాపార వేత్త లింగమనేని రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాము సమర్పిస్తున్న వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంపై లింగమనేని రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లింగమనేని పిటీషన్ పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది

మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

Image copyright EPA అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియా'గా వర్ణించారు. మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు. నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు. తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

హైదరాబాద్‌‌పై వరుణుడు పగ... మరో మూడ్రోజులు కుండపోతే...!

హైదరాబాద్‌‌పై వరుణుడు పగబట్టాడు. రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. కుంభవృష్టితో మొత్తం నగరమే అల్లకల్లోలంగా మారుతోంది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలైతే జలమయం కాగా, పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో హైదరాబాదీల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీ‌ర్‌‌పేట్‌, పంజగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌, ముషీరాబాద్‌, గాం‎ధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, నాంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావు, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, దిల్‌సుఖ్‌‌నగర్‌,...

పీపీఏలపై కేంద్రం సీరియస్: జగన్ కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రకి ఆర్కే సింగ్. ఏపీ హైకోర్టు, కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా వైయస్ జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.   పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు. పీపీఏల విషయంలో చంద్రబాబుపై ప్రధానికి జగన్ ఫిర్యాదు చేసిన అంశంపై కూడా లేఖలో ప్రస్తావించారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్‌లే కారణమంటున్న జగన్ నిర్ణయాన్ని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తప్పుబట్టారు.   డిస్కంలు నష్టాల్లో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని అంతేగానీ దానికి టారిఫ్ లే కారణం కాదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.  టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ చేస్తున్న వాదనల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయ...

48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  రేపటి నుండి 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలను బంద్ నిర్వహించడం జరుగుతున్నది.గత 15 సంవత్సరాలుగా అరకొర వేతనాలతో పని చేస్తున్నారు. కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలి మీ-సేవ కేంద్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలి.ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అర్బన్ మీ-సేవ కేంద్రాల భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సచివాలయంలో మీసేవ ఉద్యోగుల్ని విలీనం చేయాలని డిమాండ్.రేపటి నుండి 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి: చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దిగజారాయన్నారు. ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రతినిధులు, సంఘవిద్రోహ శక్తుల ద్వారా...శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చీరాలలో వైసీపీ నేత ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.

చొక్కాకు బటన్స్‌ పెట్టుకోలేదని చలానా!

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న వేలాది రూపాయల జరిమానాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటే.. అన్నీ ఉన్నా ఏదో సాకుతో చలానాలు రాస్తుండడం వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది. అర్థంపర్థం లేకుండా విధిస్తున్న జరిమానాలతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధిస్తే.. మరో వ్యక్తి లుంగీతో లారీ నడిపాడని భారీ జరిమానా వేశారు. తాజాగా రాజస్థాన్‌ లో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది. చెప్పులు ధరించి, చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కు చలానా రాశారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటని ప్రశ్నస్తే.. కోర్టుకెళ్లాలని ఉచిత సలహా పడేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఇప్పటి వరకు కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాకపోవడం విశేషం.

ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ

ఏ పీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్న వేళ... సంస్థ ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1987 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబు డీజీపీ ర్యాంకు అధికారి కావడం విశేషం. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కృష్ణబాబు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. సురేంద్రబాబుకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వేణుమాధవ్‌ మరణం టిడిపికి తీరని లోటు

సినీ నటుడు వేణుమాధవ్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే వేణుమాధవ్ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. మహానాడులో మిమిక్రీ చేసి ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీని ఎంతో అభిమానించేవారని చెప్పారు. ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేశారని తెలిపారు. వేణుమాధవ్ మరణం టిడిపికి కూడా తీరని లోటు అని చెప్పారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.