104 సేవలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయముగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే చెప్పినా గత ప్రభుత్వం మాదిరిగా ప్రైవేటు పరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 104 పటిష్టత కోసమంటూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే డా.సుజాత రావ్ కమిటీ ని వేసారని, రిపోర్ట్ లో 108 మరియు104 పధకాలను పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం ప్రయివేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ఉద్యోగ భద్రతపై ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి లను కలిస్తే 108 మాదిరిగా మీరూ ప్రైవేటు లోనే ఉంటారని తేల్చిచెప్పారని, దీనిని బట్టి ప్రభుత్వం తమ ఉగ్యోగుల సమస్యలు పట్టించుకునేలా లేదని చెప్పారు. పి పి పి( పబ్లిక్ ప్రైవేట్ పార్టీసిపేషన్) విధానాన్ని కొనసాగించేలా వైద్య అధికారులు ఇప్పటికే టెండర్లకు పిలిచారని ఇది నమ్మించి ఓట్లు వేయించుకున్న జగన్ నట్టేట ముంచగమేనని ఆందోళన వ్యక్తం చేసారు. 104 ఉద్యోగుల సంఘం పిలుపుతో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరశనలు తెలియజేస్తు, త్వరలో భారీ ఎత్తున మిలిటెంట్ మార్చ్ నిర్వహించి ,సమ్మెకు సిద్దమవుతున్నట్టు తెలిపారు.
Comments
Post a Comment