Skip to main content

ఇంతకంటే దౌర్భాగ్యం లేదు.. నారా లోకేశ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు: మంత్రి మోపిదేవి

 

ఇసుకను రాజకీయం చేస్తే టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడటం దౌర్భాగ్యమని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఆయన వ్యఖ్యలపై స్పందించాల్సి అవసరం లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించింది లోకేశ్ అని... ప్రతి రోజు కోట్లాది రూపాయల ముడుపులను తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఏం చేయాలో అర్థంకాక... ఇసుక అంశంపై నానా యాగీ చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే మంచిదని అన్నారు. విపక్షాలు ఇచ్చే సలహాలను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేవారపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుటకు ఇప్పటికే ఆదేశాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Comments