Skip to main content
ముగిసిన గీతాంజలి అంత్యక్రియలు
గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందిన సినీనటి గీతాంజలి అంతక్రియలు ముగిశాయి.
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు ఆమె అంతిమ సంస్కారాలు
నిర్వహించారు. అంతకుముందు నందినగర్‌లోని గీతాంజలి నివాసం నుంచి
భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం ఫిల్మ్‌ఛాంబర్‌కు
తరలించారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌తో పాటు రచయితల సంఘం
అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, శివాజీరాజా, రమాప్రభ, ఉత్తేజ్,
బాబూమోహన్, అన్నపూర్ణ, ప్రభ, కవిత సహా పలువురు నటీనటులు, అభిమానులు
గీతాంజలి పార్థివదేహానికి నివాళుర్పించారు. అనంతరం మహాప్రస్థానంలో
అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Post a Comment