తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కొన్ని
రోజులుగా సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ కీలక నిర్ణయం
తీసుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి
భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి
తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీలో 50
శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేట్ స్టేజ్
కేరియర్లు ఉండాలని యోచిస్తోంది. ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చే
అవకాశం ఉంది. అలాగే సెట్విన్ సర్వీసుల సేవలు వినియోగించుకోవడం వంటి
అంశాలను సర్కారు పరిశీలిస్తోంది. వీటితో పాటు మునిసిపల్ ఎన్నికలపై కూడా
కేబినెట్ చర్చించనుంది.
Comments
Post a Comment