అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి గీతాంజలి (72) ఇకలేరు. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.
1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం,హిందీ చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులో 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. బొబ్బిలి యుద్ధం, దేవత, లేతమనసులు,తోడు-నీడ, గుఢచారి-116 వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. గీతాంజలి నటించిన తొలి సినిమా సీతారామ కల్యాణం అయితే.. తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మీ చివరి సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. తమిళంలో 13,హిందీలో5,మళయాలంలో 3సినిమాల్లో గీతాంజలి నటించారు. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,రామకృష్ణ సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు.
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment