Skip to main content

బగ్దాదీని ఇలా వెంటాడాం.. ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!

 

ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని ఎలా వెంటాడిందీ అమెరికా బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా సైనికులు బగ్దాదీ ఇంటిని చుట్టుముడుతుండడం, ఓ జాగిలం పరుగులు పెట్టడం, ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరపడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, దాడికి ముందు, ఆ తర్వాత బగ్దాదీ ఇంటిని కూడా చూపించారు.

బగ్దాదీ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత అతడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్టు పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. బగ్దాదీ తనకు తాను పేల్చుకున్నప్పుడు అతడితో పాటు చనిపోయింది ముగ్గురు పిల్లలు కాదని, ఇద్దరేనని స్పష్టం చేశారు. వారి వయసు 12 ఏళ్ల లోపేనని తెలిపారు. అదే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతమైనట్టు తెలిపారు. హెలికాప్టర్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వైమానిక దాడి జరపక తప్పలేదని పేర్కొన్నారు.

బగ్దాదీ ఇంటి నుంచి ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి పలు ఎలక్ట్రానిక్, డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఆధారాలను సేకరించినట్టు మెకంజీ వివరించారు. 2004లో ఇరాక్ జైలులో బగ్దాదీని బంధించినప్పుడు అతడి నుంచి డీఎన్ఏ సేకరించామని, దాని ఆధారంగానే తాజాగా బగ్దాదీ మృతిని ధ్రువీకరించినట్టు తెలిపారు. బగ్దాదీని హతమార్చిన అనంతరం 24 గంటల్లోనే అతడి అవశేషాలను సముద్రంలో కలిపేసి అంతర్జాతీయ నిబంధనలు పాటించినట్టు మెకంజీ వెల్లడించారు. ఇక, బగ్దాదీని తరిమిన శునకం ఇప్పటి వరకు 50 దాడుల్లో పాల్గొందని, తాజా దాడిలో గాయపడినా వెంటనే కోలుకుని విధుల్లో చేరిందని తెలిపారు.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.