Skip to main content

గీత రచయిత జొన్నవిత్తులపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

 

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఓ నా బుజ్జి జొన్న" అంటూ మొదలుపెట్టి 'స్త్రీ సాంగత్యం' వరకు వెళ్లారు. "నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నీకు అప్పుడప్పుడు, కనీసం దశాబ్దానికోసారైనా స్త్రీ సాంగత్యం అవసరం, లేకపోతే అసహనంతో చచ్చిపోతావ్ జొన్నా" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. "అయినా నిన్ను నీ భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు. వాళ్ల మీద జాలి కలుగుతోంది అంటూ వెటకారం ప్రదర్శించారు. చివర్లో "ఐ లవ్యూ డా" అంటూ ట్వీట్ ముగించారు.

వర్మ వ్యాఖ్యలకు కారణం ఉంది. ఇటీవలే జొన్నవిత్తుల మీడియాతో మాట్లాడుతూ, దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడంటూ వర్మపై మండిపడ్డారు. వర్మ ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. వర్మ తనకు టీవీ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడని, అందుకే వర్మపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే వర్మ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.

Comments