దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై మానవతను చూపుతూ వారందరికీ పెన్షన్ ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, సివియర్ హెమోఫీలియా వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇదే సమయంలో బిలాటరల్ ఎలిఫాంటరియాసిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, మంచం పట్టిన పక్షవాత రోజులు, ప్రమాదాల బాధితులకు రూ. 5 వేల చొప్పున నెలవారీ సాయం చేయాలని ఆయన నిర్ణయించారు.
జనవరి 1 నుంచి ఈ పెన్షన్లు అమలుకానున్నాయి. ఈలోగా లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. దేశంలోనే ఈ తరహా వ్యాధిగ్రస్థులకు పెన్షన్ మంజూరు తొలిసారని అధికారులు అంటున్నారు. కాగా, ఈ సందర్భంగా పోస్ట్ ఆపరేషన్ అలవెన్స్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఏదైనా ఆపరేషన్ జరిగిన తరువాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో రోజుకు రూ. 225 చొప్పున రోగులకు చెల్లిస్తారు. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
Comments
Post a Comment