సిరియాలో ఆపరేషన్..
వాయువ్య సిరియాలో శనివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బగ్దాదీని మట్టుబెట్టారు. అయితే, దీన్ని ధ్రువీకరించడానికి డీఎన్‌ఏ, బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాడులు జరిపే సమయంలో అతడు ఆత్మాహుతికి యత్నించాడని అధికారులు పేర్కొన్నారు. బగ్దాదీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అధికారికంగా ప్రకటిస్తారని శ్వేత సౌధం వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్రంప్ ట్విటర్‌లో ‘ఇప్పుడే ఓ పెద్ద ఘటన జరిగింది’ అని ప్రకటించారు. ఇది మినహా దీనిపై ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. 2010లో ఐసిస్ నేతగా బగ్దాదీ వెలుగులోకి వచ్చాడు. గత ఐదేళ్లుగా అతడు ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. అతడిని మట్టుబెట్టాలని గతేడాది అమెరికా సైన్యం ప్రయత్నించి విఫలమైంది. ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహ రచన చేసి హతమార్చింది. సిరియా నుంచి అమెరికా బలగాలు వైదొలుగుతున్న సమయంలో ఐసిస్ నేత బగ్దాదీని అంతమొందించడం విశేషం.
Comments
Post a Comment