Skip to main content

శశికళ జైలు నుంచి బయటకు రావడం తథ్యం: దినకరన్

 
 


బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సత్ప్రవర్తన మీద విడుదల అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆమె విడుదలవుతారన్న ప్రచారంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ స్పందించారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో శశికళ పేరు లేదని తెలిపారు. ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలను ఆమె కూడా పాటిస్తున్నారని దినకరన్ తెలిపారు. ఖైదీల వస్త్రధారణ నిబంధనలను కూడా పాటిస్తున్నారని అన్నారు. గతంలో శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అయితే, ఆమె పూర్తి శిక్షా కాలం ముగిసే వరకు జైలులోనే ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుపుతామని న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ కూడా అన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా, ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్ష పూర్తయింది.   

Comments