Skip to main content

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌



  వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్‌ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్‌ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్‌, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు.  గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరన్‌ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. 

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.