Skip to main content

భార‌త్ చేతికి స్విస్ ఖాతాల జాబితా

             
భార‌త్ చేతికి స్విస్ ఖాతాల జాబితా
విదేశాల్లో దాగిన నల్లధనాన్ని తీసుకువ‌స్తామంటూ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని అభ్య‌ర్దిగా మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు తాజాగా బీజాలు ప‌డ్డాయి. స్విస్‌బ్యాంక్‌లో స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతానికి తొలి జాబితా అందించామని, వచ్చే ఏడాది మరికొందరి పేర్లతో తదుపరి జాబితా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు.  కాగా ఈ జాబితాలో అనేకమంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఉన్నట్టు గుర్తించారు. 2018లో అనేకమంది తమ ఖాతాలు మూసివేసినట్టు తాజా జాబితా లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Comments