Skip to main content

ఏపీలో ఈ నెల 15 నుంచి ‘రైతు భరోసా’ అమలు

ఏపీలో ఈ నెల 15 నుంచి ‘రైతు భరోసా’ పథకం అమలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్సార్ ‘రైతు భరోసా’ పెట్టుబడి సహాయ కార్యక్రమం వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రైతు సంక్షేమమే ముఖ్యమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిరోజులకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

అక్టోబర్ 10న అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద ‘రైతు భరోసా’ అర్హులు, అనర్హుల పట్టికను ప్రదర్శించనున్నట్టు వివరించింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద పీట వేయడం జరిగిందని, వీటిని సరిచేయడానికి రైతులు అర్హులు సహకరించాలని కోరింది.

భూమి కలిగి ఉన్న లక్షా 7 వేల మంది రైతులు తమ వారసులను లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికారులను వ్యవసాయ శాఖా మంత్రి కార్యాలయం ఆదేశించింది. ‘రైతు భరోసా’ ద్వారా రైతులకు నేరుగా సాయం అందేవిధంగా చర్యలు చేపట్టామని, అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అనర్హులను పూర్తి సమాచారం ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.