Skip to main content

మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపజేస్తాం: మంత్రి కన్నబాబు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతు భరోసా లబ్దిదారుల ఎంపికపై స్పందించారు. రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద 42 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపచేయాలని నిర్ణయించినట్టు కన్నబాబు తెలిపారు. మృతి చెందిన రైతుల వారసులు 1.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

లబ్దిదారులు, అనర్హుల జాబితాను వేర్వేరుగా ప్రదర్శిస్తామని, ఆదాయపన్ను చెల్లించే 1.5 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలిందని వెల్లడించారు. అదేసమయంలో భూములున్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. కౌలు రైతుల విషయానికొస్తూ, రాష్ట్రంలో 15.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఆధార్ సీడింగ్, ప్రజాసాధికార సర్వేతో లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తున్నామని, 4.2 లక్షల ఆధార్ కార్డులు భూముల వివరాలకు సరిపోలడం లేదని అన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.