Skip to main content

అప్పుడు వనజాక్షి... ఇప్పుడు సరళ... కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి: పవన్ కల్యాణ్

అప్పట్లో తహసీల్దార్ వనజాక్షి వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై దాష్టీకం కూడా అంతే ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రబిందువుగా నిలిచారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా అధికారిపై దాడి చేసిన కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి అంటూ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశారు. అప్పుడు వనజాక్షి, ఇప్పుడు సరళ... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, విధుల్లో నిజాయతీగా వ్యవహరించి ప్రజాప్రతినిధుల దౌర్జన్యానికి గురయ్యారని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఉన్న మహిళలపైనే ఇలాంటి దాడులకు తెగబడుతుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పవన్ లేఖ పూర్తి పాఠం ఇదిగో

Comments