కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment