Skip to main content

రష్యా టీకా సమర్థతపై సమాచారం లేదు: డబ్ల్యూహెచ్ఓ

 

ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.

 ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.  

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here