పక్షి కోసం రూ.2 కోట్ల కారును పక్కన పెట్టేశాడు.. పక్షి కట్టుకున్న గూడే కదా అని దాన్ని తీయలేదు దుబాయ్ యువరాజు.. వివరాలు చూస్తే ఓ పక్షి కోసం రూ.2 కోట్ల విలువైన కారును వాడకుండా పక్కన పెట్టారు దుబాయ్ యువరాజు షేక్ రషీద్ అల్ మఖ్దూం. ఇటీవల రూ.2 కోట్ల ఖరీదైన తన మెర్సిడెస్ AMG G63 కారుపై ఓ పక్షి గూడు కట్టుకుని పొదగడం ప్రారంభించింది. దానికి హాని కల్గించడం ఇష్టం లేక కారును వాడకుండా పక్కన పెట్టేశాడు. పక్షి ఆటంకం కల్గించకుండా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తన సిబ్బందిని ఆదేశించాడు. యువరాజు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment