ఎన్నికలకుముందే ఏకగ్రీవంగా @PrajaRajadhani గా అమరావతి, సీఆర్డీఏచట్టం నిర్ణయంజరిగింది. జీవో ఇచ్చి రెండునెలలైనా 186కోట్ల రైతులకౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతులత్యాగంతో కూడిన భూమితోసహా రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారంఇచ్చారు @ysjagan గారు pic.twitter.com/b4ZzkaIhaA
— Devineni Uma (@DevineniUma) August 14, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి గ్రాఫిక్స్ కాదని, ఇది నిజమైన రాజధాని అంటూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. రైతులు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని విమర్శించారు.
'ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతుల త్యాగంతో కూడిన భూమితో పాటు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారు వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.
Comments
Post a Comment