Skip to main content

నాని 'వి'కి అమెజాన్ భారీ ఆఫర్... ఓకే చెప్పేసిన దిల్ రాజు!


 దిల్ రాజు నిర్మాతగా నాని నటించిన 25వ చిత్రం 'వి' షూటింగ్ పూర్తయినా, కరోనా, లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీకి విక్రయించేందుకు గతంలో వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ ను దిల్ రాజు తిరస్కరించారని, ఈ చిత్రాన్ని సినిమా హాల్స్ లోనే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు రాగా, ఇప్పుడాయన మనసు మారినట్టు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ రాగా, తాజాగా దిల్ రాజు, సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుందని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటించారన్న సంగతి తెలిసిందే.  

Comments