అభ్యంతరకర పోస్ట్ పెట్టినందుకు కత్తి మహేష్ అరెస్ట్
సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ లో శ్రీరాముడికి సంబంధించి అభ్యంతరకర పోస్ట్ పెట్టినందుకు కొందరి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శ్రీరామ నవమికి ముందు అతడు శ్రీరాముడిని కించపరిచేలా పోస్టులు పెట్టగా.. హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వీటిపై కేసులు నమోదు చేసి, విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఆ పోస్టులను మహేశ్ పోస్ట్ చేశారని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి.
Comments
Post a Comment