కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు.
ఆ నూతన
విధానంపై మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి
చేశారు. ‘‘నూతన విద్యా విధానంలోని త్రి భాషా సూత్రం అత్యంత బాధాకరం. ఈ
విషయంపై పునరాలోచించుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయా
విధానాల ప్రకారం రాష్ట్రాలను అమలు చేయనివ్వండి’’ అని సీఎం పళని స్వామి
సూచించారు.
Comments
Post a Comment