Skip to main content

రాముడి గుడి భూమి పూజకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా..!

   


రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై...


అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున ఉన్న సాకేతపురి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెలుగు జిలులుగులతో ప్రకాశిస్తున్నశ్రీరామనగరిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నగరం మొత్తం స్వాగత తోరణాలు కడుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి విచ్చేస్తున్న అతిరథ మహారథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. ఇక్బాల్ అన్సారీకి ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ.. బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదంపై న్యాయ పోరాటం చేశారు. ఆయన 95 ఏళ్ల వయసులో 2016లో కన్నుమూయడంతో ఆ తర్వాత అన్సారీ ఆ బాధ్యత స్వీకరించారు.

తనకు అందిన ఆహ్వానంపై అన్సారీ ఇలా స్పంధించారు… నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని అన్నారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను’ అని అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానన్నారు. కోర్టు తీర్పుతో వివాదం ముగిసిపోయిందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, ఆయనను కలిసి రామచరిత్‌ మానస్, రామనామం రాసి ఉన్న రాయిని అందజేస్తానని అన్సారీ వెల్లడించారు. నేను అయోధ్యకు చెందినవాడిని, ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం దశ మారుతుందని, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం’ అని అభిప్రాయపడ్డారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.