అమరావతి రైతులకు టీడీపీ నేత బీటెక్ రవి సంఘీభావం ప్రకటించారు. ఈరోజు ఆయన
అమరావతి ప్రాంతంలోని రైతుల నిరసన శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ, మూడు రాజధానులను నిరసిస్తూ తాను ఇప్పటికే శాసనమండలి
సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని... ఇప్పుడు ఛైర్మన్
ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు
కూడా పదవులకు రాజీనామా చేయాలని కోరారు. రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులు
రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని... ముందు జనసేన
ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని అన్నారు. అమరావతి విషయంలో పవన్ స్టాండ్
ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు
Comments
Post a Comment