కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (77) నిన్న కరోనా వైరస్ బారినపడ్డారు.
తనకు కరోనా వైరస్ సంక్రమించిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా
వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని
సూచించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు
చేయించుకున్నానని, ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు.
తనకు కరోనా సోకినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని, అయినప్పటికీ ముందు
జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. కాగా,
నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తనకు కరోనా సోకినట్టు ట్వీట్
చేశారు.
Comments
Post a Comment