కొత్త కొత్త ప్రయోగాలతో, ఇప్పటి వరకూ చాలా వినూత్నమైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకొచ్చిన షియోమీ, ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఫోన్ తీసుకురానున్నట్లు పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే, Xiaomi కొత్త తరహాలో కనిపించేలా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చెయ్యడానికి తీసుకున్న పేటెంట్స్ లో, వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను ఫోన్ లోపలే అమర్చే విధంగా కొత్త విధానం పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్ పైభాగంలో ఇయర్ బడ్స్ స్లాట్ ను స్థూపాకార షాఫ్ట్ లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ గా కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తుంది.
ఊహించని విధంగా, చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఐడియాల పైన ఆసక్తి చూపడం, షియోమికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి, Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ లను విడుదల చేసిన షియోమి కి, కొత్త డిజైన్లతో ఫోన్లను లాంచ్ చేసిన చరిత్ర ఉంది.
కొత్త పేటెంట్ల నుండి ప్రేరణ పొంది, LetsGoDigital వారి ఆలోచన ప్రకారం ఊహాచిత్రాలను, డిజైన్ రెండర్ లను క్రియేట్ చేసింది.
రెండు పేటెంట్ల ప్రకారం, ఫోన్ పైభాగంలో రెండు రంధ్రాలు ఉంటాయి, అవి వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కలిగి ఉంటాయి. షాఫ్ట్‌లో ఉంచినప్పుడు ఈ ఇయర్ బడ్స్ పైకి చూపిస్తాయి, అయితే ఇది చెవులకు బాగా సరిపోయేలా వివిధ కోణాల్లో ఇరుసుగా ఉంటుంది. నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో శామ్సంగ్ ఎస్-పెన్ను ఎలా అందిస్తుంది అనేదానికి ఈ ఆలోచన చాలా పోలి ఉంటుంది.
దాని రూపాన్ని బట్టి, ఇయర్ బడ్‌లు స్లాట్ లో ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్‌గా కూడా మార్చుకోవచ్చు.
Comments
Post a Comment