Skip to main content

Vivo V19 : రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమ్మడవుతోంది



ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది.

Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది.

ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.

Vivo అభిమానులకు శుభవార్త ! వివో సంస్థ, ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. అంతేకాదు, ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.            

Vivo V 19  లేటెస్ట్ ప్రైస్

వివో వి 19 యొక్క 8 జిబి + 128 జిబి వేరియంట్ ధర ముందుగా రూ .27,990 కాగా ప్రస్తుతం రూ .24,990 ధరతో అమ్ముడవుతోంది, 8 జిబి + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ముందుగా Rs. 31,990 రూపాయలకు అమ్మడవగా, ప్రస్తుతం 27,990 రుపాయల ధరతో అమ్ముడవుతోంది. ఈ ఫోన్ పియానో ​​బ్లాక్ మరియు మిస్టిక్ సిల్వర్ కలర్‌లో లభిస్తుంది.

Vivo V 19 : ప్రత్యేకతలు

వివో వి 19 పంచ్-హాల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఒక 6.44-అంగుళాల FHD + డిస్ప్లే ను 2400 x 1080 పిక్సెళ్ల  రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, ఇందులో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC శక్తిని కలిగి ఉంది మరియు ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజితో జతచేయబడుతుంది.

Vivo V 19  : కెమేరా 

ఈ ఫోన్‌ ముందుభాగంలో, ఒక 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ కెమెరా లభిస్తోంది, దీనికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ మద్దతు ఉంది. అంటే, ఇది డ్యూయల్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది.  ఇది కాకుండా, ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ఉంది, దీనిలో 48 మెగాపిక్సెల్స్ ప్రాధమిక కెమెరా ఉంది మరియు ఇది ఎపర్చరు ఎఫ్ / 1.8 తో ఉంటుంది మరియు ఇది ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో (PDAF) తో వస్తుంది.

రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డేడికేటెడ్ మాక్రో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 9.2 లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్, మిస్టిక్ సిల్వర్ మరియు గ్లీమ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలలో వస్తుంది.


Comments