Skip to main content

పరీక్షలు రద్దు చేసి, మమ్మల్ని డిగ్రీలు ఇమ్మంటే ఎలా?: సుప్రీంకోర్టులో యూజీసీ వాదన



 విపత్తు నిర్వహణ చట్టం పేరు చెప్పి, రాష్ట్రాల పరిధిలో పరీక్షలను రద్దు చేసి, ఆపై సర్టిఫికెట్లను ఇవ్వాలని తమను కోరడాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తప్పుపట్టింది. డిగ్రీలను ప్రదానం చేయడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలను రూపొందించే అధికారం తమకు మాత్రమే ఉందని, దీన్ని రాష్ట్రాలు మార్చలేవని సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. సెప్టెంబర్ 30 లోపల ఆఖరు సంవత్సరం ఎగ్జామ్స్ ను నిర్వహించాల్సిందేనని తేల్చింది.


యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, పలు ప్రాంతాలకు చెందిన 31 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాషణ్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. యూజీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ విషయంలో రాష్ట్రాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాయని,  విద్యార్థుల డిగ్రీలను గుర్తించకపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.

విద్యార్థులు తమ చదువును కొనసాగించాలని, పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండాలని, పరీక్షలు జరిపించకుండా డిగ్రీలను ఇచ్చే అవకాశాలే లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, యూజీసీ ఆదేశాలను విపత్తు చట్టం అధిగమించగలదా? అని ప్రశ్నించింది. దీనికి 14వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.  

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  రేపటి నుండి 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలను బంద్ నిర్వహించడం జరుగుతున్నది.గత 15 సంవత్సరాలుగా అరకొర వేతనాలతో పని చేస్తున్నారు. కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలి మీ-సేవ కేంద్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలి.ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అర్బన్ మీ-సేవ కేంద్రాల భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సచివాలయంలో మీసేవ ఉద్యోగుల్ని విలీనం చేయాలని డిమాండ్.రేపటి నుండి 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు