తాను వేరే పరీక్షల కోసం నిన్న ఆసుపత్రికి వెళ్లగా, తనకు కరోనా కూడా
సోకినట్టు నిర్ధారణ అయిందని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న
తెలిపిన విషయం తెలిసిందే. మరోపక్క, మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం
గడ్డకట్టడంతో నిన్న ఆయనకు న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు.
అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. ప్రస్తుతం
ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. నిన్న
మధ్యాహ్నం 12.07కి ఆయన తమ ఆసుపత్రిలో చేరారని పేర్కొంది.
Comments
Post a Comment