రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ రేట్లు అమల్లోకి వచ్చాయి..*
◆మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
◆ఈ క్రమంలో వెబ్‌సైట్ ద్వారా రెవెన్యూశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది.
*అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..*
*విజయవాడ, గుంటూరులో 10శాతం, విశాఖపట్నంలో 25 శాతం, అనంతపురంలో 30శాతం మేర ధరలను పెంచింది..*
◆అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
◆పెంచిన భూముల ధరలతో రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
◆మార్కెట్ ధరలకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోని వ్యత్యాసాల పరిశీలనకు ఓ కమిటీని నియమించింది.
◆పరిస్థితులకు అనుగుణంగా ఈ కమిటీ భూముల ధరలను నిర్ణయించనుంది.
*ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటన విడుదల చేశారు...*
Comments
Post a Comment