జులై 29 వ తేదీన ఇండియాకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు ఇండియాకు రావడంతో మన రక్షణ వ్యవస్థ మరింత పెరిగింది. అయితే, ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్ లో రాత్రి సమయంలో నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విమానాల సహాయంతో చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అక్సాయ్ చిన్ లోని చైనా ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు ఈ రఫేల్ విమానాల ద్వారా గుర్తిస్తున్నట్టు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు ఈ విమానాలు పహారా కాస్తున్నాయి. ఇక ఇండియా మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా, అందులో తొలివిడతగా ఐదు విమానాలను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment