Skip to main content

54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉంది..కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా?: సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని తెలిపారు. 

బల పరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ అదెప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న అని అభిషేక్ సింఘ్వి చెప్పారు. గవర్నర్ కు అజిత్ పవార్ సమర్పించిన లేఖలో 54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉంది.. కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ లేఖలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. రెండు పక్షాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.